ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నందున అధికారులు దృష్టి సారించారు. కొమ్ముగూడెం పంచాయతీలో ఐటీడీఏ పీవో గౌతమ్ పర్యటించారు. కొమ్ముగూడెం పంచాయతీలోని రెండు గ్రామాల్లో 113 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. కాగా ముత్యాల గూడెంలో 62 కేసులున్నట్లు వివరించారు.
కొమ్ముగూడెం గ్రామంలో ఐటీడీఏ పీవో పర్యటన - కారేపల్లి మండలంలో ఐటీడీఏ పీవో పర్యటన
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెం, ముత్యాలగూడెం పంచాయతీలలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఐటీడీఏ పీవో పర్యటించి కట్టడి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఖమ్మం జిల్లా వార్తలు
ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. గ్రామాల్లో వందకు పైగా కేసులున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తహసీల్దారు తెలిపారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీనగర్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని... అక్కడ చాలా మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో యువకుడు మృతి