ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపుడిలో ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామంలో తిరుగుతూ.. చేపట్టిన పనులు తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, వన నర్సరీ, వీధుల్లో పారిశుధ్యం, గ్రామంలో కల్పించిన మౌలిక వసతులు క్షుణ్ణంగా పరిశీలించారు.
తాటిపుడిలో ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ - ig nagireddy latest news
పల్లెప్రగతిలో చేపట్టిన పనుల పురోగతిపై ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పల్లెప్రగతి కార్యక్రమానికి ముందు, తర్వాత వచ్చిన మార్పుల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు.
![తాటిపుడిలో ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ig nagireddy sudden inspection in khammam dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6295460-882-6295460-1583330586340.jpg)
తాటిపుడిలో ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ
హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షణ, నర్సరీల పెంపకం గురించి సర్పంచిని ప్రశ్నించారు. పల్లెప్రగతికి ముందు ఆ తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులను గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్దికి తోడ్పడాలన్నారు.
తాటిపుడిలో ఐజీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ