తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల్లో దండయాత్ర

పదవి కోసం, ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఆయన మాత్రం గిన్నిస్ రికార్డే లక్ష్యంగా దండయాత్ర చేస్తున్నారు. ప్రధాన పార్టీల భీ-ఫాంతో హేమాహేమీలతో తలపడ్డారు. నేనున్నానంటూ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు. 1970 నుంచి 34 సార్లు లోక్​సభ, శాసనసభ బరిలోకి దిగారు.

34సార్లు పోటీ చేసిన ఒకే ఒక్కడు

By

Published : Mar 25, 2019, 10:10 PM IST

34సార్లు పోటీ చేసిన ఒకే ఒక్కడు

1970 నుంచి పోటీ

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన బాణోత్ లక్ష్మణ్ నాయక్... 1970 నుంచి ఇప్పటి వరకు దాదాపు 34సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా జిల్లాపరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారి కూడా గెలవకున్నా ఎప్పుడూ నిరాశ పడలేదు. 17వ లోక్​సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే ఖమ్మం నుంచి నామినేషన్ సమర్పించగా... 25న నల్గొండ నుంచి దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పీవీపై కోపంతోనే..

అప్పట్లో హన్మకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఖరారు చేశారు. ఏమైందో ఏమో ఆ స్థానం నుంచి పీవీ నరసింహారావు బీఫాం తీసుకుని నిల్చున్నారు. తన సీటు లాక్కున్నారని కోపంతో ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ఓట్లు చీల్చి పీవీ ఓటమికి కారకుడయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి నరసింహారావుపై పోటీ చేసి చరిత్ర సృష్టించారు. రాంపూర్ పార్లమెంట్ నుంచి ఆయనతో తలపడ్డారు. ఇలా ఎక్కడ పోటీ చేసినా... ఆయన ప్రత్యర్థిగా బరిలో నిల్చున్నారు.

1980లో 25వేల ఓట్లు

1980లో ఖమ్మం పార్లమెంట్​కు పోటీ చేసి 25వేల ఓట్లు సాధించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి 3సార్లు, మిర్యాలగూడ నుంచి 2సార్లు, నల్గొండ నుంచి 2సార్లు, హన్మకొండ, నంద్యాల నుంచి ఒక్కోసారి పోటీ చేశారు. పాలేరు అసెంబ్లీ బరిలో ఐదుసార్లు తలపడ్డారు. అంతేకాదు..ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ ఛైర్మన్​గా నిల్చున్నారు. పంజాబ్, మహారాష్ట్ర ఎన్నికల బరిలోనూ నిల్చున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని రోపేడ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగారు.

గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్న లక్ష్మణ్ నాయక్ పేరు పోటీ పరీక్షల్లోనూ వస్తోంది. ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఎవరు పోటీ చేశారు? అని ప్రశ్నలు కూడా ఇవ్వడం గమనార్హం.

ఇవీ చూడండి:కంచుకోట​లో కమ్యూనిస్టుల అస్తిత్వ పోరాటం

ABOUT THE AUTHOR

...view details