Heavy Rain in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు మధ్యాహ్నం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్న పెద్ద చింత చెట్టు కూలిపోయింది. ఆక్సిజన్ ప్లాంట్ పైపులపై చింత చెట్టు పడింది, అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి పట్టణంలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భద్రాచలం పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భద్రాచలంలో వర్ష బీభత్సం... ఆసుపత్రిలో రోగులకు తప్పిన ప్రమాదం.. - భద్రాద్రిలో వర్ష బీభత్సం
Heavy Rain in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొత్తగూడెం, భద్రాచలం పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పెద్ద చింత చెట్టు కూలిపోయింది.

Heavy Rain in Bhadradri