తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్​ అమ్మాయి - హిందు సంప్రదాయంలో అన్వేష్‌తో ప్రాన్స్‌కి చెందిన కేరోల్పేహతు వివాహం

ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు.. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదంటారు. వారి ప్రేమలో నిజాయతీ ఉంటే పెద్దలు సైతం అంగీకరించి.. ఆశీర్వదించేస్తారు.. అలా మనసులు కలిసిన ఓ ఫ్రాన్స్​ అమ్మాయి-భద్రాద్రి అబ్బాయి పెద్దల మనసును గెలిచి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Frans women Bhadradri man
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్​ అమ్మాయి

By

Published : Aug 1, 2022, 7:50 PM IST

ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపించింది ఈ జంట. ఖండాంతరాలు దాటి.. ఈ ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకున్నారు. ఫ్రాన్స్​కు చెందిన కేరోల్ఫేహతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అన్వేశ్​ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. చర్ల మండలంలో ఫ్రాన్స్​ అమ్మాయి-తెలంగాణ అబ్బాయి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వేడుకగా జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి చెందిన అన్వేశ్​ ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లాడు. చదువుకునే సమయంలో ఫ్రాన్స్​ దేశానికి చెందిన కేరోల్ఫేహతుతో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన స్నేహం కాస్తా.. కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఒకరికొకరు తమ ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఇద్దరు ప్రేమించుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఫ్రాన్స్​ వెళ్లిన కేరోల్ఫే తల్లిదండ్రులతో మాట్లాడి.. అన్వేశ్​తో పెళ్లికి ఒప్పించింది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఉండే.. వరుడి తల్లిదండ్రులను కలిసి పెళ్లికి వారి అనుమతి కోరింది.

వివాహనికి రెండు కుటుంబాలు అంగీకారం చెప్పడంతో హిందూ సంప్రదాయంలో వారిద్దరు ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి ఫ్రాన్స్ నుంచి కేరల్ఫేహతు తల్లిదండ్రులు హాజరయ్యారు. ఖండాంతరాలు దాటి ఏకమైన జంటను గ్రామస్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై.. ఆశీర్వదించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details