తెలంగాణ

telangana

ETV Bharat / city

కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత - కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చెన్నూరు ఉన్నత పాఠశాలకు చెందిన వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. విద్యార్థినులకు ప్రమాదమేమి లేదని వైద్యులు తెలిపారు.

food poisoning to few girls in khammam
కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత

By

Published : Mar 6, 2020, 9:50 PM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విద్యార్థులు తరలించి వైద్య చికిత్సలు అందించారు. కలుషిత ఆహారం వల్లే విద్యార్థులు ఈ సమస్య వచ్చిందని వైద్యురాలు తెలిపారు.

పలువురు విద్యార్థులు బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికావడం, కలుషితాహారం ప్రభావంతో వాంతులు అయ్యాయని వెల్లడించారు. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత

ఇవీ చూడండి:'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

ABOUT THE AUTHOR

...view details