కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాలు, రైతు సంఘాల నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే జాతీయ రహదారిపై రాపర్తి నగర్ వద్ద బైటాయించి ధర్నా చేపట్టారు.
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాల ధర్నా
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. ఖమ్మంలో జాతీయ రహదారిపై బైటాయించి నేతలు తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాల ధర్నా
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామినాథన్ కమిటీ సీఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఆమోదించుకున్న మూడు చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చూడండి:దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రమాదం