తెలంగాణ

telangana

ETV Bharat / city

వేతనాలు చెల్లించాలని ఒప్పంద కార్మికుల ధర్నా - ఆసుపత్రి ముందు ఒప్పంద కార్మికుల ధర్నా

పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనా వార్డుల్లో సేవలందిస్తున్నందుకు తాము వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

cotract employees protest at khammam government hospital
వేతనాలు చెల్లించాలని ఒప్పంద కార్మికుల ధర్నా

By

Published : Aug 8, 2020, 8:22 PM IST

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులు ధర్నా ఆసుపత్రి ఎదుట చేశారు. తమకు రావాల్సిన రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్​కి వేతనాలే కాకుండా ప్రోత్సహకాలు ఇస్తామన ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైటాయించి మూడు గంటల పాటు అందోళన చేశారు. ఆస్పత్రుల్లో పనిచేయడం వల్ల తమ ఇళ్ల వద్ద వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లిస్తామన్న ఆర్​ఎం హామీతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details