ఖమ్మం నగరాన్ని పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో నగరపాలక కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. రహదారి ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు. పాదచారుల బాటలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువకు ఇరువైపులా ప్రభుత్వ భూములను సంరక్షించి.. ఉద్యానవనాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.
సాగర్ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్
ఖమ్మం నగరం మరింత పచ్చగా, పారిశుద్ధ్యంగా ఉండేట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పాలనాధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూమిలో ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామన్నారు.
సాగర్ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్
ఇవీచూడండి: ఏన్కూరులో అక్రమ మట్టి తవ్వకాలు