తెలంగాణ

telangana

ETV Bharat / city

విశ్వనాథపల్లిలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ పరిశీలన

ఖమ్మం జిల్లా విశ్వనాథపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెళ్లారు. సింగరేణి మండలంలో ఇసుక లేక ఆగిపోతున్న అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని గ్రామస్థులు ఫిర్యాదు చేయగా.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

collector rv karnan at viswanathapalli
సింగరేణిలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ పరిశీలన

By

Published : Dec 23, 2019, 10:56 AM IST

ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఇసుక లేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్​ దృష్టికి తీసుకెళ్లారు. విశ్వనాథ పల్లిలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభానికి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు.

40 ఇళ్లకు 20 మాత్రమే ఎందుకు పూర్తయ్యాయని అధికారులను ప్రశ్నించగా ఇసుక సమస్య ఉందని వారు చెప్పారు. వైరా, ఎర్రుపాలెం నుంచి తెచ్చుకోమని కలెక్టర్ చెప్పగా.. తమకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దని.. అధికారులు అనుమతించట్లేదని తెలిపారు.

మైనింగ్​ అధికారులతో మాట్లాడి అనుమతులు అందిస్తానని కలెక్టర్ హామీఇచ్చారు. అనంతరం గ్రామసర్పంచ్​తో మాట్లాడి పల్లెప్రగతికి చేస్తున్న ప్రణాళికను తెలుసుకున్నారు.

సింగరేణిలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ పరిశీలన

ఇవీ చూడండి:యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details