తెలంగాణ

telangana

ETV Bharat / city

మిషన్​ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు దోపిడీ చేశారు: భట్టి విక్రమార్క - భట్టి విక్రమార్క వార్తలు

Bhatti Vikramarka padayatra: కాంగ్రెస్​ హయాంలో నిధులు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్​ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

clp leader bhatti
clp leader bhatti

By

Published : Mar 2, 2022, 6:39 PM IST

Bhatti Vikramarka padayatra: తెలంగాణ కంటే ముందే.. ఖమ్మం జిల్లా మధిరలో ఇంటింటికి తాగునీరు అందించామని సీఎస్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మిషన్​ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

మధిర నియోజకవర్గంలో పీపుల్స్​ మార్చ్​ పేరుతో భట్టి చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజుకు చేరింది. ఇవాళ ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర పండ్రెగుపల్లికు చేరుకుంది. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ హయాంలో నిధులు మంజూరు చేస్తే.. ఇప్పటికి పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించకుండా ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు.

'రాష్ట్రం కంటే ముందే మధిర నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. మిషన్​ భగీరథ పేరుమీద రూ.50 వేల కోట్ల దోపిడీ చేశారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించకుండా నిద్రపోతున్నారు.'

- మల్లు భట్టి విక్రమార్క, మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత

మిషన్​ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు దోపిడీ చేశారు: భట్టి విక్రమార్క

ఇదీచూడండి:'కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​.. అందుకే వారికే కీలక పోస్టింగులు'

ABOUT THE AUTHOR

...view details