కాంగ్రెస్ కార్యకర్తలంతా రాష్ట్రంలోని పేదలకు సాయంగా నిలవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలక కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు, కౌన్సిలర్ మల్లాది సవితల ఆర్థిక సాయంతో బియ్యం, కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పంపిణీ కొనసాగుతుందని దాతలు తెలిపారు.
నిత్యావసరాల పంపిణీ ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి - మధిరలో కూరగాయలు పంపిణీ చేసిన భట్టి
ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేతల ఆర్థిక సాయంతో ఏర్పాటుచేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎల్పీ నేత భట్టి ప్రారంభించారు. రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు.

బియ్యం, కూరగాయలు పంపిణీ ప్రారంభించిన భట్టి