కరోనా మహమ్మారిని తరిమికొట్టే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేటలో రైతులు, హమాలీలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు రూపొందించిన కరోనా అవగాహన పుస్తకాలను ఆవిష్కరించారు. ముదిగొండ మండలం కమలాపురంలో పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు మాస్కులు అందించారు. భౌతికదూరం పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మహాయజ్ఞంలో భాగస్వామ్యులవ్వండి: భట్టి - ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేటలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. రైతులు, హమాలీలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వైరస్‌ను తరిమికొట్టే మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యులవ్వాలని కోరారు
మహాయజ్ఞంలో భాగస్వామ్యులవ్వండి: భట్టి