తెలంగాణ

telangana

ETV Bharat / city

Bhadradri Temple: శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతున్న భద్రాద్రి - శ్రీరామనవమి ఉత్సవాలు

Bhadradri Temple: శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి రామాలయం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 2 నుంచి 16 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు.

Bhadradri Temple
విద్యుద్దీపాల అలంకరణలో భద్రాద్రి రామాలయం

By

Published : Mar 30, 2022, 6:41 PM IST

Bhadradri Temple: భద్రాద్రి రామాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి వాటి పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఏప్రిల్ 10 న జరగనున్న సీతారాముల కల్యాణం మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు.

మిథిలా స్టేడియం

ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణం జరిగే మిథిలా స్టేడియం వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసేందుకు తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... సీతారాముల కల్యాణానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు, గోడ ప్రతులను మంగళవారం ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు.

భక్తులకు పంపిణీ చేసేందుకు తలంబ్రాలను సిద్ధం చేస్తున్న సిబ్బంది

ఇదీ చదవండి:Yadadri Temple News: యాదాాద్రిలో ఆ కేంద్రాలు నేటి నుంచి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details