తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడు మండలాల ఆస్తుల పంపకాలకు ఆమోదం

ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసినందున అక్కడ పనిచేసిన సిబ్బంది, పోస్టులు, ఆస్తులు, అప్పుల పంపకాలను ఆమోదిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఏడు మండాలల ఆస్తుల పంపకాలకు ఆమోదం

By

Published : Nov 24, 2019, 2:50 PM IST

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసినందున అక్కడ పనిచేసిన సిబ్బంది, పోస్టులు, ఆస్తులు, అప్పుల పంపకాలను ఆమోదిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

అంతకు ముందు - ఆ తర్వాత
రాష్ట్ర విభజనకు ముందు ఈ మండలాలు తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం వాటిని ఏపీలో విలీనం చేసింది. దీంతో అవి ఏపీలో విశాఖపట్టణం కేంద్రంగా గల తూర్పు డిస్కం పరిధిలోకి చేరాయి.

షీలాబేడీ కమిటీ ఆమోదం
ఏడు మండలాల్లో గల ఆస్తులు అప్పులను కూడా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు సంస్థలు ఆడిట్ చేయించి పంచుకుని కేంద్రం నియమించిన షీలాబేడీ కమిటీ ఆమోదానికి పంపాయి. ఈ కమిటీ కూడా వీటికి గతంలోనే ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర డిస్కం తెలుపగా.. కమిటీ ఆమోదాన్ని అంగీకరిస్తున్నట్లు ఇంధనశాఖ తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇంధనశాఖ ఉత్తర్వులు

  1. ఇంధన శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసిన లైన్ మెన్, ఇతర సిబ్బందిని తెలంగాణ డిస్కంలోకి తీసుకున్నారు.
  2. ఏపీలో విలీనానికి ముందు అక్కడున్న సబ్ స్టేషన్లు, విద్యుత్ పంపిణీ విభాగంలో మొత్తం 38 మంది సిబ్బంది పనిచేసేవారు. వీరిని ఎక్కడ పనిచేస్తారని ఆప్షన్ అడగడంతో.. కేవలం ఆరుగురు మాత్రమే ఏపీ తూర్పు డిస్కంకి వెళతామని ఆప్షన్ ఇచ్చారు. దీంతో వారిని అటు పంపారు.
  3. మిగిలిన 32 మందిని తెలంగాణ ఉత్తర డిస్కంలోకి తీసుకుని వారిని ఖమ్మం జిల్లాలోనే ఇతర ప్రాంతాల్లో గతంలో నియమించారు.
  4. ఈ నియమకాలతో పాటు ఆ మండలాల్లోని విద్యుత్ ఆస్తులు, అప్పుల పంపకాలను కూడా ఆమోదిస్తున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: పంటల బీమాకు రూ. 205కోట్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details