తెలంగాణ

telangana

ETV Bharat / city

39 ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడిలో కలిసిన విద్యార్థులు - ఖమ్మం జిల్లా వార్తలు

ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా చదువులమ్మ చెట్టు నీడలో మళ్లీ కలిశారు. తమ చదువులు పూర్తయ్యాక వేరు వేరు ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. 39 ఏళ్ల తర్వాత ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాటి స్నేహితులంతా కలుసుకున్నారు. స్నేహ మాధుర్యాన్ని చాటుకున్నారు.

Alumni of the 1981-82 academic year met at Madhira Government Junior College in khammam
39 ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడిలో కలిసిన విద్యార్థులు

By

Published : Feb 22, 2021, 3:24 PM IST

1981-82 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు.. మొదటిసారిగా తాము చదువుకున్న ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు.

ఈ సమ్మేళనానికి నాటి పూర్వ విద్యార్థి, ప్రస్తుత గవర్నర్ సహాయ కార్యదర్శి చింతా సీతారాములు హాజరై స్నేహితులతో సంతోషంగా గడిపారు. రెండు రోజులపాటు స్నేహితులంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సమ్మేళనంలో పాల్గొన్నారు.

39 ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడిలో కలిసిన విద్యార్థులు

ఇదీ చూడండి: యాదాద్రి పాతగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details