తెలంగాణ

telangana

ETV Bharat / city

Lakaram Tank Bund : లకారం పర్యాటకానికి సరికొత్త సొబగులు.. - hanging bridge on lakaram tankbund khammam

Lakaram Tank Bund : ఖమ్మం సిగలో కలికితురాయిగా ఉన్న లకారం ట్యాంక్ బండ్​పై తీగల వంతెన రూపంలో మరో అదనపు హంగు చేకూరింది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న లకారం ట్యాంక్ బండ్ సందర్శకులకు మధురానుభూతులు పంచేందుకు సిద్ధమవుతోంది. రూ.8 కోట్లతో నిర్మించిన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది.

Lakaram Tank bund, లకారం ట్యాంక్​ బండ్​
Lakaram Tank bund

By

Published : Dec 19, 2021, 9:10 AM IST

Updated : Dec 19, 2021, 9:43 AM IST

Lakaram Tank Bund : లకారం పర్యాటకానికి సరికొత్త సొబగులు..

Lakaram Tank Bund : రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే లకారం అందాలు నగరవాసుల్ని కట్టిపడేస్తున్నవేళ వేలాడే తీగల వంతెన.. లకారం ట్యాంక్ బండ్ అందాలను మరింత ద్విగుణీకృతం చేసేందుకు ముస్తాబవుతోంది. లక్నవరం, సిద్దిపేట తరహాలో సందర్శకులను కనువిందు చేసేందుకు అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది.

జల సోయగాలు.. అల్లుకున్న పచ్చదనం..

Lakaram Tank Bund Timings : రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతీసుకొని లకారం ట్యాంక్​బండ్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారు. లకారం చెరువుకు ఆకర్షించే ముఖద్వారం, తొణికిసలాడే జల సోయగాలు, పరిసరాల్లో అల్లుకున్న పచ్చదనం, హట్‌లు, వాకింట్ ట్రాక్‌లు, కాలిబాటల సుందరీకరణతో తొణికిసలాడుతోంది. సుందర సరసు చెంత సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు సందర్శకులు వేలాదిగా తరలివస్తున్నారు.

30 ఏళ్ల వరకు..

Hanging bridge in Khammam : లకారం ట్యాంక్​బండ్‌పై వేలాడే తీగల వంతెనను రూ.8 కోట్లతో నిర్మించారు. దేశవ్యాప్తంగా 141 వంతెనలు విజయవంతంగా నిర్మించిన నిర్మాణ సంస్థ అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. వంతెనను మోస్తున్న ప్రధాన తీగలు కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. 58 టన్నుల ఇనుప ఉపకరణాలు వినియోగించారు. తుప్పు పట్టకుండా ఉక్కు, స్టీలు, పరికరాలకు ప్రత్యేక రంగులు వినియోగించారు. 30 ఏళ్ల వరకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా తీగల వంతెనను పటిష్ఠంగా నిర్మించారు.

ఇదీచూడండి:Yadadri Temple Reopening : మరో 100 రోజుల్లో యాదాద్రి మూలవరుల దర్శనభాగ్యం

Last Updated : Dec 19, 2021, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details