ప్రేమించి రెండేళ్లు శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఖమ్మం జడ్పీ కూడలిలో ఆందోళన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన యువకుడు దేవేందర్ తాను ప్రేమించుకున్నామని హైదరాబాద్కు చెందిన ఓ యువతి తెలిపింది.
శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆందోళన - hyderabad news
ఖమ్మం జడ్పీ కూడలిలో ఓ యువతి ఆందోళనకు దిగింది. ప్రేమించుకొని.. రెండెళ్లుగా సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అడిగితే తప్పించుకుని తిరుగుతున్నాడంటూ యువతి ఆరోపించింది.

శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆందోళన
రెండేళ్లుగా కరీంనగర్, ఖమ్మంలో కలిసి సహజీవనం చేస్తున్నామని తెలిపింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడం వల్ల నిరాకరించి తప్పించుకు తిరుగుతున్నాడని యువతి ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని... అతనికే సహకరిస్తున్నారని యువతి కన్నీటి పర్యంతమైంది.