తెలంగాణ

telangana

ETV Bharat / city

'సేవ్ సాయిల్' నినాదంతో బాలిక సైకిల్ యాత్ర - save soil slogan

భవిష్యత్ కాలంలో రాబోయే ఆహార నష్టాన్ని గుర్తించిన ఓ బాలిక ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టింది. కామారెడ్డికి చెందిన ఆ అమ్మాయి చేస్తున్న సైకిల్ యాత్ర 14 వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుని... సోమవారం రోజున భద్రాద్రికి చేరింది.

vennela
వెన్నెల

By

Published : May 17, 2022, 8:14 PM IST

రాబోయే కాలంలో వచ్చే ఆహార కొరతను గుర్తించిన ఓ బాలిక ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగిస్తోంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన వెన్నెల అనే అమ్మాయి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుత కాలంలో పంటలకు వాడుతున్న రసాయనాలతో భూసారం పూర్తిగా దెబ్బతింటోంది. దాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టానని వెన్నెల తెలిపింది.

భద్రాద్రికి చేరుకున్న వెన్నెలకు స్వాగతం పలుకుతున్న స్థానికులు

భవిష్యత్తులో ఆహారం దొరకడం కూడా కష్టంగా మారుతుందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశమని వెన్నెల స్పష్టం చేసింది. ఇప్పటివరకు 24 జిల్లాల్లో 14 వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సోమవారం భద్రాచలానికి చేరుకున్న బాలికకు స్థానికులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానం పలికారు.

'నాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామం. సద్గురు జగ్గీవాసుదేవ్ ప్రపంచ వ్యాప్తంగా భూమిని రక్షించడం కోసం 'సేవ్ సాయిల్' పేరిట 30 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర 100 రోజులు చేపట్టారు. ఆయణ్ని స్పూర్తిగా తీసుకుని నేను ఈ సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. తెలంగాణలో 5 వేల కిలోమీటర్లు సైకిల్​పై యాత్ర చేయాలని నేను నిశ్చయించుకున్నాను. మే 1వ తారీఖున ఈ సైకిల్ యాత్ర ప్రారంభించాను. రాబోయే తరానికీ భూసారం తగ్గి ఆహారం అందించడం చాలా కష్టంగా మారుతోంది. భూసారం పెంచాలనే అవగాహన కల్పించడానికే ఈ యాత్ర చేస్తున్నాను.' -వెన్నెల

ఇదీ చదవండి :ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలంగాణ యువతి

ABOUT THE AUTHOR

...view details