తెలంగాణ

telangana

ETV Bharat / city

సాగర్‌ కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు - సాగర్‌ కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

ఖమ్మంలో నగరంలోని యూపీహెచ్‌ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు సాగర్‌ కాలువలో గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురిని స్థానికులు రక్షించగా.. మిగిలిన ఇద్దరికోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

2 children missing in sagar Canal in khammam
సాగర్‌ కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

By

Published : Apr 17, 2020, 7:37 PM IST

సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఖమ్మంలో నగరంలోని యూపీహెచ్‌ కాలనీకి చెందిన ఐదుగురు చిన్నారులు సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లారు. ఒడ్డున ఆడుకుంటూ లోతులోకి వెళ్లారు. ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న యువకుడు ముగ్గురు పిల్లల్ని కాపాడాడు. మరో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చిన్నారులు కోమ్ము నందకిశోర్‌(12), జటంగీ నితిన్‌(11) ఇళ్ల వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.

సాగర్‌ కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details