తెలంగాణ

telangana

ETV Bharat / city

తల్లే చంపేసింది - peddapalli district

కనిపెంచిన తల్లే.. ఇద్దరు చిన్నారులను ఇటుకతో చావబాదింది. మానసిక రోగి అయిన తల్లి చేసిన దాడిలో ఇద్దరూ మృతిచెందారు. పండుగ వేళ ఈ హృదయవిదారకమైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.

ఇటుకతో పిల్లల్ని చంపిన తల్లి

By

Published : Mar 4, 2019, 12:23 PM IST

Updated : Mar 5, 2019, 7:07 AM IST

.

కిరాతకంగా మారి ఇటుకతో పిల్లల్ని చంపిన తల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రమాదేవి అనే మహిళ తన ఇద్దరు కుమారులను ఇటుకలతో చితకబాదింది. తీవ్రగాయాలైన 11 ఏళ్ల అజయ్​ అక్కడికక్కడే మృతి చెందగా... మరో కుమారుడు ఆర్యన్​ చికిత్స పొందుతూ మరణించాడు.
మానసిక పరిస్థితి బాగోలేకే..
మానసిక వ్యాధితో బాధపడుతున్న రమాదేవి... భర్తతో పాటు పిల్లలతోనూ గొడవ పడుతోంది. కొద్ది రోజులు ప్రైవేటు టీచర్‌గా పనిచేసిన ఆమె పిల్లల పట్ల దురుసుగా వ్యవహరిస్తోందని యాజమాన్యం తొలగించింది. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై భర్త వైద్యులను సంప్రదించాడు.
అసలేం జరిగింది?
పూజా సామగ్రి కోసం భర్త బయటకు వెళ్లిన సమయంలో రమాదేవి ఇటుకలతో పిల్లల తలపై కొట్టింది. తలకు తీవ్ర గాయమై అజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికొచ్చిన శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండో కుమారుడిని కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆర్యన్ అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి రమాదేవిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Mar 5, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details