తెలంగాణ

telangana

ETV Bharat / city

బెంబేలెత్తించిన భల్లూకం.. గ్రామస్థుల్లో భయంభయం - సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి హల్​చల్​

ఆకలితో ఉన్న ఎలుగుబంటి ఎప్పటిలాగే ఆ కాలనీలోకి వచ్చింది. గుడిలో ఉన్న కొబ్బిరి చిప్పలు తినేందుకు ఆలయంలోకి ప్రవేశించింది. భల్లూకం రాకను గమనించిన గ్రామస్థులు చాకచక్యంగా గుడి తలుపులు మూసివేశారు. నిన్న రాత్రి నుంచి ఎలుగును గుడిలోనే నిర్బంధించి.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

బెంబేలెత్తించిన భల్లూకం.. భయాందోళనలో గ్రామస్థులు
బెంబేలెత్తించిన భల్లూకం.. భయాందోళనలో గ్రామస్థులు

By

Published : Aug 1, 2020, 9:14 AM IST

Updated : Aug 1, 2020, 9:23 AM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలోని ఎస్సీ కాలనీకి ఎలుగుబంటి ప్రవేశించింది. పోచమ్మ గుడిలో నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఎలుగుబంటి వెళ్లడాన్ని గ్రామస్థులు గుర్తించారు. బయటకు వస్తే ఎవరిపై దాడి చేస్తుందో అనే భయంతో.. ఎలుగుబంటి ఆలయంలో ఉన్న సమయంలో గేట్లు మూసేశారు. శనివారం రాత్రి నుంచి ఎలుగుబంటిని గుడిలోనే నిర్బంధించి ఉంచారు.

ప్రస్తుతం ఆలయ గర్భగుడిలోనే దేవత విగ్రహం వెనుక ఎలుగుబంటి నక్కి ఉన్నందున ఎవరికీ కనిపించడం లేదు. ఉదయమే అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. గుడిలో ఉన్న కొబ్బరి చిప్పలను తినడానికి అప్పుడప్పుడు భల్లూకం వస్తూ పోతుందని గ్రామస్థులు తెలిపారు.

బెంబేలెత్తించిన భల్లూకం.. భయాందోళనలో గ్రామస్థులు

ఇవీ చూడండి:12 ఆసుపత్రులు తిరిగినా బాలింత ప్రాణం దక్కలే!

Last Updated : Aug 1, 2020, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details