Vemulawada Rajanna Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదాయం రూ. 87 కోట్ల 78 లక్షలు వచ్చింది. కరోనా కారణంగా దాదాపు రెండు నెలలు దర్శనాలు నిలిపివేసినా భారీగానే సమకూరింది. ఈ ఏడాది సమ్మక్క, సారలమ్మ జాతర రావడంతో అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
భారీగా పెరిగిన వేములవాడ రాజన్న వార్షికాదాయం... ఎంతంటే? - ములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదాయం
Vemulawada Rajanna Temple: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదాయం రూ. 87 కోట్ల 78 లక్షలు వచ్చింది. ఇందులో హుండీ ద్వారా 28.34 కోట్లు రాగా, కోడె మొక్కులతో 18.28 కోట్లు వచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
వేములవాడ రాజన్న వార్షికాదాయం
2019-20 సంవత్సరంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగగా... ఆ ఏడాది ఆలయానికి రూ.85 కోట్ల ఆదాయం రాగా 2021-22 సంవత్సరానికి రూ.87.78 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో హుండీ ద్వారా 28.34 కోట్లు, కోడె మొక్కులతో 18.28 కోట్లు, ప్రసాదాల ద్వారా 13.86 కోట్లు, ఆర్జిత సేవలతో రూ.6.83 కోట్లు, లీజులు, అద్దెల ద్వారా రూ.5.35 కోట్లు, సహా ఇతరత్రాల ద్వారా మరికొంత వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 2 గంటల సమయం
Last Updated : Apr 17, 2022, 3:34 PM IST