కొవిడ్ విజృంభిస్తున్న వేళ గర్భిణీలకు వైద్యం కరవైంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన గర్భణీ కమలకు సరైన వైద్యం అందక కడుపులోనే ఇద్దరు శిశువులు మృతి చెందారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కమలకు వారం కిందట సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించామని తెలిపారు. వారం తర్వాత ప్రసవం కోసం రావాలని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఐదు రోజులకే పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే... కరోనా రోగులను మాత్రమే చూస్తున్నామని వైద్యులు చెప్పారని వాపోయారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెెళ్లాలని సూచించారని అన్నారు.
కరోనా వేళ గర్భణీకి అందని వైద్యం.. శిశువులు మృతి! - తెలంగాణ వార్తలు
కరోనా మహమ్మారి వేళ గర్భిణీలకు వైద్యం కరవైంది. సకాలంలో వైద్యం అందక కడుపులోనే కవల శిశువులు మృతి చెందారు. అమ్మతనం కోసం నవమోసాలు ఎదురు చూసిన ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. ఈ ఆపత్కాలంలో ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్తే పట్టించుకున్న దాఖలాలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితురాలిని పరీక్షించిన గజ్వేల్ వైద్యులు... బీపీ తక్కువగా ఉందని హైదరాబాద్కు తీసుకెళ్లాలని చెప్పారని వాపోయారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. స్కానింగ్ చేసి కవల పిల్లలు ఉన్నారని తెలిపారని అన్నారు. అప్పటికే ఒకరు గర్భంలో మృతి చెందినట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్స చేయగా... మరో పాప మరణించిందని కన్నీటిపర్యంతమయ్యారు. బాలింతరాలు కమలకు వైద్యం అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు శిశువులు మృతి చెందారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:తెల్లవారితే పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి!