తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను తితిదే ప్రకటించింది. ఒక్కరోజు బ్రహ్మోత్సంగా పిలిచే రథసప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. సూర్య జయంతి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు వాహనాలపై దర్శనమివ్వనున్నారు. కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరిలో జరిగే ఉత్సవాల వివరాలు ప్రకటించిన తితిదే - చిత్తూరు తాజా సమాచారం
తిరుమలలో వచ్చే నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను తితిదే ప్రకటించింది. సూర్య జయంతి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు వాహనాలపై దర్శనమివ్వనున్నట్లు పేర్కొంది.
ఫిబ్రవరిలో జరిగే ఉత్సవాల వివరాలు ప్రకటించిన తితిదే
వివరాలు ఇలా..
ఫిబ్రవరి 7-స్మార్థ ఏకాదశి, ఫిబ్రవరి 8-వైష్ణవ మాధ్వ ఏకాదశి, ఫిబ్రవరి 11-శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం, ఫిబ్రవరి 12-కుంభ సంక్రమణం, శ్రీతిరుక్కచ్చినంబి ఉత్సవారంభం, ఫిబ్రవరి 16-వసంత పంచమి, ఫిబ్రవరి 19-రథసప్తమి, ఫిబ్రవరి 23-భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 24-శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, ఫిబ్రవరి 27-కుమారధారతీర్థ ముక్కోటి.