కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలో భాజపా పార్టీ కార్యాలయం ముందు తెరాస ఏర్పాటు చేసిన మంత్రి గంగుల కమలాకర్ అభినందన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. భాజపా మహిళా కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని చించివేశారు. విషయం తెలుసుకున్న కాలనీ తెరాస మద్దతుదారులు అక్కడికి చేరుకొని గొడవకు దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మూడవ పట్టణ సీఐ విజ్ఞాన్ రావు కేసు నమోదు చేశారు.
కేటీఆర్ మాటను గౌరవించరా?