కరీంనగర్ జిల్లా మిడ్మానేరు భూ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను డిసెంబర్ 31లోపు నెరవేర్చాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
'మిడ్మానేరు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి'
డిసెంబర్ 31లోపు మిడ్మానేరు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోమన్నారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
తెరాస చేస్తోన్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ప్రస్తావించడం సిగ్గుచేటని పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 31లోపు పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోమని.. ప్రభుత్వం మిడ్మానేరు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నలుగురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు వైద్యకళాశాలతో పాటు లెదర్‌పార్క్ తీసుకురాకపోవడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి:'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'