కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కరీంనగర్ ప్రజల్లో రోజురోజుకీ అవగాహన పెరుగుతోంది. నిత్యావసరాల కోసం ప్రభుత్వం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సమయం ఇవ్వగా ప్రజలు విలువైన సమయాన్ని వినియోగించుకుంటున్నారు. సామాను కొనుగోలు చేసుకోవడానికి మూడు గంటల సమయం సరిపోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెడికల్ షాపుల ముందు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలైన్లు కడుతున్నారు.
కరోనా వ్యాప్తి నివారణ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన - కరీంనగర్ ప్రజలు
లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్ ప్రజల్లో కరోనా వ్యాప్తి నివారణ పట్ల రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. నిత్యావసరాల కోసం మరే ఇతర పనుల కోసం ప్రజలు అధికారులు నిర్ణయించిన సమయంలోనే ఇళ్ల నుంచి బయటకు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు.
![కరోనా వ్యాప్తి నివారణ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన The people of Karimnagar are aware of corona care](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6558425-607-6558425-1585286392947.jpg)
కరోనా వ్యాప్తి నివారణ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
నగరంలో కూరగాయల మార్కెట్లను పెంచడం వల్ల కొంత రద్దీ తగ్గిందనే చెప్పుకోవాలి. నేటి నుంచి కూరగాయలను కొనుక్కునేందుకు 12 గంటల వరకు సమయాన్ని పెంచినట్టు అధికారులు తెలిపారు. కూరగాయలు తీసుకునేవారు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. కరీంనగర్ 60 డివిజన్లలోని కార్పొరేటర్లు కరోనా వ్యాధి నివారణపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నివారణ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
ఇవీ చూడండి:పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?