Vemulawada Rajanna Hundi Counting: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.2,30,69,807 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. బుధవారం సీసీ కెమెరాల నిఘా మధ్య ఆలయ ఒపెన్ స్లాబ్పై 25 రోజుల ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు.
రాజన్న హుండీ లెక్కింపు... ఎంత సమర్పించారంటే? - శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
Vemulawada Rajanna Hundi Counting: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. బుధవారం సీసీ కెమెరాల నిఘా మధ్య ఆలయ ఓపెన్ స్లాబ్పై 25 రోజుల భక్తుల కానుకల లెక్కింపు చేపట్టినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
Vemulawada Rajanna
దాదాపు గత 20రోజులుగా ఆలయానికి భక్తుల తాకిడి అధికంగానే ఉంది. బంగారం 428 గ్రాములు, 23 కిలోల 330 గ్రాముల వెండి కానుకలను భక్తులు సమర్పించినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'యాదాద్రి, భద్రాద్రి'లకు కొత్త సమస్య!.. విద్యుత్ కేంద్రాలకు రుణం నిలిపివేత