మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు, ఆయన వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఈటల వర్గీయులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌లో ఈ వివాదం చోటు చేసుకొంది.
ఈటల ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి.. డీజేకు అనుమతి లేదంటూ ఫ్యూజ్లను తొలగించారు. దీంతో ఈటల అనుచరులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను పట్టించుకోని ఎస్సై తన వాహనం ఎక్కి కూర్చొన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల అనుచరులు.. ఎస్‌ఐ వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. కొంత మంది జోక్యం చేసుకొని ఎస్‌ఐతో మాట్లాడి.. డీజేకు సంబంధించిన ప్యూజ్లను ఇప్పించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.