తెలంగాణ

telangana

ETV Bharat / city

టెలిమెడిసిన్: ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గిస్తున్న యువ వైద్యులు - telemedicine in karimnagar district

కరోనా రెండో దశలో ఎంతో మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. బెడ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాకు. ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడానికి.. ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు కరీంనగర్ యువ వైద్య బృందం టెలిమెడిసిన్ సేవలకు నడుం బిగించింది.

telemedicine, telemedicine in karimnagar
టెలిమెడిసిన్, కరీంనగర్​లో టెలిమెడిసిన్

By

Published : May 15, 2021, 11:05 AM IST

సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకగానే... చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. బెడ్ల కొరతతో పాటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. టెలిమెడిసిన్‌ సేవలు ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా... అపోహలతో ప్రజలు అటువైపు వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజల్లో అపోహలు పొగొట్టేందుకు నడుం బిగించింది... కరీంనగర్‌కు చెందిన యువ వైద్య బృందం. పీజీకి సిద్ధమవుతున్న విద్యార్థులంతా కలిసి ఉచిత టెలిమెడిసిన్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫోన్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో... కరోనా భయాలు మటుమాయం... అంటున్న ఆ వైద్య బృందంతో ప్రత్యేక ముఖాముఖి.

టెలిమెడిసిన్​తో ఆస్పత్రులపై తగ్గనున్న ఒత్తిడి

ABOUT THE AUTHOR

...view details