పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం కారణంగా ఆరో యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. టర్బైయిన్లో లోపాన్ని గుర్తించిన అధికారులు యూనిట్‌ను నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు ప్రారంభించారు.
'500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం' - ramagundam ntpc
రామగుండం ఎన్టీపీసీ కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆరో యూనిట్ టర్బైయిన్లో సాంకేతిక సమస్య రాగా యూనిట్‌ను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
!['500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం' technical issue in ramagundam ntpc power generation was stopped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8555468-258-8555468-1598367392463.jpg)
'500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం'
రెండ్రోజుల క్రితం నాలుగో యూనిట్లో సాంకేతిక లోపం ఏర్పడగా మరమ్మత్తులు నిర్వహించి.. మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. ఒక యూనిట్ సిద్ధం కాగానే మరో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో 1900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ'