తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వ్యాప్తి చెందకుండా నోట్లను శానిటైజ్‌ చేస్తున్న వ్యాపారి - నోట్లకు కరోనా

కరోనా వ్యాప్తి చెందకుండా కరీంనగర్‌ జిల్లా గుండ్లపల్లి క్రాస్‌ రోడ్డులోని ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని వినూత్నంగా ఆలోచించారు. కరెన్సీ నోట్లను శానిటైజ్‌ చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పరికరంతో నోట్లను శుద్ధి చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌కి వచ్చే వినియోగదారులు ఇచ్చే నగదును ఓ బకెట్‌లో వేసి అందులో శానిటైజర్‌ లిక్విడ్‌ పోసి ఉంచుతున్నారు. అనంతరం వైపర్ స్ప్రే ద్వారా నోట్లను ఎండబెడుతున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా నోట్లను శానిటైజ్‌ చేస్తున్న వ్యాపారి
కరోనా వ్యాప్తి చెందకుండా నోట్లను శానిటైజ్‌ చేస్తున్న వ్యాపారి

By

Published : Jul 30, 2020, 5:31 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలి.. వ్యాపారం సజావుగా సాగాలంటే.. ఎలా అని ఆలోచించిన ఆ వ్యాపారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. వ్యాపారం నడిపించుకుంటూనే కరోనా సోకకుండా ఉండేందుకు కాస్తా భిన్నంగా ఆలోచించాడు.

అంతటా ద్రావకం స్ప్రే..

కరీంనగర్‌ జిల్లా గుండ్లపల్లి క్రాస్‌ రోడ్డులోని ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కొండ రవీందర్ కరెన్సీని శానిటైజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని కొనుగోలు చేసి దీని ద్వారా కరెన్సీపై, సూపర్ మార్కెట్​లోని వస్తువులపై ద్రావకం స్ప్రే చేస్తున్నారు. కరెన్సీ నోట్లకు కూడా వైరస్ అంటుకునే ప్రమాదం ఉండడం, ఆ నోట్లను తీసుకున్న వారికి కూడా వ్యాధి సోకే అవకాశముందని భావించి ఈ మిషన్​ను కొనుగోలు చేశారు.

నగదును బకెట్​లో..

సూపర్ మార్కెట్​కు వచ్చే వినియోగదారులు ఇచ్చే నగదును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బకెట్​లో వేయమని చెప్తున్నారు. అందులో కూడా శానిటైజర్ లిక్విడ్ పోసి ఉంచుతున్నారు. ఆ తరువాత వైపర్ ద్వారా స్ప్రే చేసి నోట్లను గాలికి ఎండబెతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిలో కరెన్సీ తీసుకోవడం లేదు కదా! మీరెందుకు ఈ చర్యకు పూనుకున్నారని రవీందర్​ను ప్రశ్నిస్తే.. 'వ్యాధి.. యజమానిగా నాకు రాకూడదు, ఇక్కడకు వచ్చే వినియోగదారులకు రాకూడదన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా' అని చెప్తున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా నోట్లను శానిటైజ్‌ చేస్తున్న వ్యాపారి

ఇవీ చూడండి:ఏపీ రాజ్​భవన్​లో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details