తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా భయంతోనే 80 శాతం మంది బడికి దూరం' - corona affect on students

ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమైనా 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు... తక్కువగా ఉంటుంది. కారణమేంటని అధికారులు సర్వే నిర్వహించగా... కరోనా భయంతోనే 80% మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించడం లేదని తేలింది.

corona effect on schools
'కరోనా భయంతోనే 80 % మంది బడికి దూరం'

By

Published : Nov 22, 2020, 7:45 PM IST

ఏపీలో కరోనా భయంతోనే 80% మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు బడికి పంపించడం లేదని... ఆరాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పాఠశాలలు పునః ప్రారంభమైనా 9,10 తరగతుల విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటడంపై అధికారులు సర్వే చేశారు. 71 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఎక్కువమంది కరోనా భయంతోనే తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు ఇష్టపడటం లేదని వెల్లడించారు.

జడ్పీ పాఠశాలలు కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటం, రవాణా సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో.. మరికొందరు బడులకు వెళ్లట్లేదు. వసతి గృహాలను తెరవకపోవటంపై.. వీటిల్లో చదువుకునే వారు ప్రస్తుతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొందరు విద్యార్థులు కొవిడ్-19 బారిన పడినట్లు సర్వేలో వెల్లడైంది. ఇంటికే పరిమితమవుతున్న వారిలో 85% మంది ఆన్​లైన్, వాట్సప్, ఇతర విధానాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా భయంతోనే బడులకు పంపించకపోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇవీచూడండి:కరోనా సెకండ్​ వేవ్​ వచ్చినా ఎదుర్కొంటాం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details