కరోనాతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల(software engineer) కొలువుల్లో మార్పులేకపోయినా.... వారి నిత్యజీవితంలో ఒత్తిళ్లు మాత్రం దూరమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఏడాది నుంచి అనేకమంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు(work from home) నిర్వర్తిస్తున్నారు. కన్నవారి ప్రేమానురాగాల మధ్య...ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు సహా అనేక చోట్ల కుటుంబానికి దూరంగా ఉండే వారంతా... ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇంట్లో వారికి దూరంగా వెళ్లడం... ప్రయాణ భారంతో మొదట్లో ఒత్తిడికి గురయ్యే వారమని యువ ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంతో తేలికగా పని చేసుకోగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విభిన్న అభిప్రాయాలు..