Sri Venkateswara swamy temple in Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రథోత్సవం సందర్భంగా రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వేకువజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తూ... మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు - రథోత్సవ వేడుక
Sri Venkateswara swamy temple in Sircilla: సిరిసిల్ల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రథంపై కొలువుదీరి శ్రీవారి దర్శనం కోసం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథోత్సవానికి పోలీసులు భారీగా భద్రత కల్పించారు.
రాష్ట్రంలో అత్యంత ఎత్తైన రథంపై శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రథంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. అనంతరం భక్తుల దర్శనార్థం స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి... ఊరేగింపుగా ప్రధాన కూడళ్లలో శోభాయాత్ర చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రథోత్సవానికి పోలీసులు భారీగా భద్రత కల్పించారు.
ఇవీ చదవండి: