సింగరేణిలోని కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికులు సమస్యలు తీర్చాలని పెద్దపల్లి జిల్లా రామగుండం-3 జీఎం కార్యాలయం ముందు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సింగరేణిలో డెల్టా ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారు. అవసరానికి మించి అదనపు సిబ్బంది ఉన్నందున వేతనాలు సరిగా అందడం లేదని ఆరోపించారు.
సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికుల ధర్నా - డెల్టా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్
అవసరానికి మించి సిబ్బందిని నియమించడం వల్ల తమకు సరిగా వేతనాలు అందడం లేదని సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం-3 జీఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు.
![సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికుల ధర్నా singareni contract security employes protest at ramagundam3 general manager office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6359150-thumbnail-3x2-singareni.jpg)
సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికుల ధర్నా
డెల్టా కాంట్రాక్టర్ టెండర్లో 71 మందికి గానూ 113 మందిని నియమించడం వల్ల ఒక్కొక్కరికి 26 రావాల్సిన మస్టర్లు 21 మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారమవుతుందన్నారు. ఇటీవల 26 మందిని అదనంగా నియమించినందున ప్రస్తుంత 15 మస్టర్లు మాత్రమే వస్తున్నట్టు పేర్కొన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ కార్మికుల ధర్నా
ఇదీ చూడండి:అభిమానులకు ఎన్టీఆర్ హోలీ గిఫ్ట్
Last Updated : Mar 10, 2020, 7:13 PM IST