కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థుల నిరసన - karimnagar latest news
ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థుల నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు కళ్లకు గంతలు కట్టుకొని ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.