తెలంగాణ

telangana

ETV Bharat / city

మన రాష్ట్రంలోనూ కాస్తున్న రుద్రాక్షలు... ఎక్కడో తెలుసా?

rudrakshas in karimnagar: చల్లని వాతావరణం కలిగిన నేపాల్​లో మాత్రమే కాసే పంటగా పేరున్న రుద్రాక్షలు... ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఓ విశ్రాంత అధికారి పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అతను వాటిని పండించడానికి మన దగ్గర వాతావరణం అనుకూలమని నిరూపించారు.

rudrakshas on trees
తెలంగాణలోనూ రుద్రాక్ష

By

Published : Feb 12, 2022, 1:49 PM IST

rudrakshas in karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లిలో చెట్లకు రుద్రాక్షలు కాస్తున్నాయి. చల్లని వాతావరణం కలిగిన నేపాల్​లో మాత్రమే కాసే పంటగా పేరున్న రుద్రాక్షలు.. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఓ విశ్రాంత అధికారి పండిస్తున్నారు. మన దగ్గర వాతావరణం కూడా వీటి సాగుకు అనుకూలమని నిరూపించారు.

తెలంగాణలోనూ రుద్రాక్ష

'తోటలో 14సంవత్సరాల కింద ఈ రుద్రాక్ష చెట్లు నాటాను. సంవత్సరాలు గడుస్తున్నా చెట్లు ఏపుగా పెరిగాయి కానీ ఫలాలు కాయలేదు. అయినా ఎటువంటి నిరాశ చెందకుండా వాటికి నీరు పెడుతూ పెంచసాగాను. అలా ఈ ఏడాది కాయలు చేతికి అందడంతో వాటి పై పొర తొలగించి త్రిముఖి రుద్రాక్షలు సేకరించాను. తోటలోని రుద్రాక్ష చెట్లు ఫలాలు అందించడంతో ఇన్నాళ్లు చేసిన శ్రమ ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. తోటకు మూడు వైపులా గుట్టలు ఉండడంతో మిగతా చోట్ల కన్నా వాతావరణం చల్లగా ఉంటుంది. రుద్రాక్ష చెట్లు కాయడానికి అదే అనుకూలంగా మారింది.'

-విశ్రాంత అధికారి ఆకుల లక్ష్మయ్య, న్యాలకొండపల్లి కరీంనగర్

తెలంగాణలోనూ రుద్రాక్ష

ABOUT THE AUTHOR

...view details