తెలంగాణ

telangana

ETV Bharat / city

కరీంనగర్​ సీపీ కమలాసన్​రెడ్డి బదిలీ.. సత్యనారాయణకు పోస్టింగ్​ - Kamalasan Reddy

ramgundam cp V Satyanarayana appointed as Karimnagar CP
ramgundam cp V Satyanarayana appointed as Karimnagar CP

By

Published : Jul 27, 2021, 7:25 PM IST

Updated : Jul 27, 2021, 7:43 PM IST

17:54 July 27

కరీంనగర్​ కొత్తగా సీపీగా సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్టర్​, పలు మున్సిపల్​ కమిషనర్లకు స్థానచలనం కల్పించిన సర్కారు... తాజాగా కరీంనగర్​ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డిని బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కమలాసన్​రెడ్డికి... ఆదేశాలు జారీ చేసింది. రామగుండం సీపీగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను కరీంనగర్​ సీపీగా నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం కొత్త పోలీస్ కమిషనర్‌గా రమణకుమార్​ను నియమించింది. 

కలెక్టర్​, మున్సిపల్​ కమిషనర్లు బదిలీ...

ఇటీవలే... కరీంనగర్​ కలెక్టర్​గా విధులు నిర్వహించిన శశాంకను బదిలీ చేయగా... కొత్త కలెక్టర్​గా ఆర్వీ కర్ణణ్​ను ప్రభుత్వం నియమించింది. శశాంకను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్​ చేయాలని సూచించింది. హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ కమిషనర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుత కమిషనర్లు ప్రసన్నరాణి, రషీద్‌ను పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మీర్​పేట కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.సుమన్ రావును జమ్మికుంట కమిషనర్‌గా బదిలీ చేశారు. మిర్యాలగూడ కమిషనర్ సీహెచ్ వెంకన్నను హుజూరాబాద్‌కు బదిలీ చేశారు. హుజారాబాద్‌ ఆర్డీవో(ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌) పి.బెన్‌ షలోమ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ స్థానంలో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డిని నియమించింది.

ఉపఎన్నికల నేపథ్యంలో...

త్వరలో హుజూరాబాద్​ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్​, సీపీ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హుజూరాబాద్​ ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కారు.. ప్రభుత్వాధికారులను బదిలీ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు...  హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పురపాలకశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చూడండి: 

Last Updated : Jul 27, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details