తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే - చొప్పదండిలో ఆస్తుల నమోదు ప్రక్రియ

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను కలెక్టర్​ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పరిశీలించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు కౌన్సిలర్​ స్థానంలో ఆమె భర్త రావడం పట్ల కలెక్టర్​ అభ్యంతరం వ్యక్తం చేశారు.

property registration at choppadandi was inspected by collector sashanka
ఆస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్​ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్

By

Published : Oct 15, 2020, 8:24 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను కలెక్టర్​ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణంతో పాటు ఖాళీ స్థలాల కొరతపై స్పష్టత కలిగి ఉండాలని.. ఆస్తుల నమోదును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

మహిళా కౌన్సిలర్​ స్థానంలో ఆమె భర్త హాజరుకావడం పట్ల కలెక్టర్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఆస్తులను నమోదు చేస్తున్నా... మహిళా ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం సరికాదని శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతు వేదికలను పరిశీలించి.. వాటి నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండిఃఅక్టోబర్ 15లోగా.. చీరలు పంచాలి : కలెక్టర్ శశాంక

ABOUT THE AUTHOR

...view details