వానాకాలంలో ప్రభుత్వ సూచనతో సాగుచేసిన సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. కరీంనగర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హస్తం నేతలు కలెక్టర్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. అప్పటికే భారీగా మొహరించిన పోలీసులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం ముందు కార్యకర్తలు, రైతులు బైఠాయించారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత నెలకొంది.
ఉద్రిక్తతకు దారితీసిన కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి - కరీంనగర్ కాంగ్రెస్ వార్తలు
కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ హస్తం నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
కలెక్టరేట్ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు