తెలంగాణ

telangana

ETV Bharat / city

కల్తీ కల్లు.. గుట్టు రట్టు - కల్తీ కల్లు.. గుట్టు రట్టు

లాక్​డౌన్ కారణంగా వైన్​షాపులు బంద్ ఉండడం వల్ల రాష్ట్రంలో అక్రమ గుడుంబా, కల్తీకల్లు తయారీ పెరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో గుట్టుగా తయారుచేస్తున్న ఓ కల్తీకల్లు కేంద్రంపై పోలీసులు దాడి చేశారు.

Police Rides On Adulterous Toddy in jagityal
కల్తీ కల్లు.. గుట్టు రట్టు

By

Published : Apr 23, 2020, 8:51 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలు మూసి వేయటం వల్ల కల్లు, గుడుంబాకు బాగా డిమాండు పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు కల్తీ కల్లు తయారీకి ఎగబడ్డారు. జగిత్యాల పట్టణంలోని లడ్డూఖాజా చౌరస్తా కటిక వాడ సమీపంలో ఓ ఇంట్లో నీళ్లతోనే కల్తీకల్లు తయారు చేస్తుండగా జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 500 లీటర్ల కల్లుతోపాటు, తయారు చేసేందుకు వినియోగించే డ్రమ్ములు, కల్లులో కలిపే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులను అరెస్ట్‌ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేష్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఎస్‌బీ పోలీసులతోపాటు, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details