కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అలుగునూరులో ఈ రోజు తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని పోలీసులు సూచించారు. 50 కెమెరాలు ఇచ్చేందుకు గ్రామస్థులు ముందుకొచ్చారు. సహకరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని కారు, ట్రాక్టర్, టాటా ఏస్ వాహనం, 3 ఆటోలు, 39 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ ఉషారాణి, సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
అలుగునూరులో పోలీసు నిర్బంధ తనిఖీలు - carden search in alugugnuru
కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

అలుగునూరులో పోలీసు నిర్భంద తనిఖీలు