కరోనా రోగులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల్లో మార్పురావడం లేదు. కొవిడ్ బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరినా.. అక్కడక్కడా అమానవీయ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇలాంటి ఘటన జరిగింది. కరోనా సోకిన మహిళను.. ఇంట్లోకి రానివ్వలేదు అద్దె ఇంటి యజమాని. వీలైతే సాయం చేయాల్సింది పోయి... కర్కషంగా వ్యవహరించాడు. గత్యంతరం లేక సదరు బాధితురాలు.. శుక్రవారం మార్కెట్లో గడపగా.. శనివారం.. రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ తోపుడు బండిపై తలదాచుకొంది.