ఎత్తైన కొండ... కొండపై శత్రు దుర్భేద్య కోట. కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, మొగలుల ఏలుబడిలో... వైభవాన్ని చాటింది. ఓ సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ప్రాంతం. కరీంనగర్ జిల్లా చారిత్రక వైభవానికి సాక్షీభూతంగా నిలిచిన ఎలగందుల ఖిల్లా అసామాన్య నిర్మాణ కౌశలానికి ప్రతీక. ఆకాశాన్నంటే అద్భుత మినార్లు... ఔరా అనిపించే కోట బురుజులు, అబ్బుర పరిచే కట్టడాలు... ఆనాటి రాజుల రక్షణ వ్యవస్థకు అద్దం పడతున్నాయి. కానీ రానురానూ నిర్లక్ష్యానికి గురై ఠీవి కోల్పోయింది.
కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల - ఎలగందుల కోట
రాజులు పోయారు... రాజ్యాలు పోయాయి... కానీ ఆనాటి రాజరికపు వైభవానికి ప్రతీకగా... వారు నిర్మించిన కోటలు నిలిచాయి. నిర్మాణ శైలీ, కళా వైభవం... ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించిన... ఎలగందుల కోట కరీంనగర్ జిల్లా చరిత్రకు సాక్ష్యంగా నిలబడ్డది. కానీ నిర్లక్ష్యానికి గురై... కాల క్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. ఈ కోటను పర్యాటకశాఖకు అప్పగించారే తప్ప... సదుపాయలు కల్పించడం మాత్రం మరిచారు. రోజురోజుకూ పర్యటకుల తాకిడి ఎక్కువైతున్న ఈ కోటపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.
కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల
అప్పట్లో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న ఎలగందులను... ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా ప్రకటించి పురావస్తుశాఖకు అప్పగించిందే తప్ప... శిథిలమైతున్న కోటను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోజురోజుకూ పర్యటకుల తాకిడి పెరుగుతున్నా... సదుపాయాలు మాత్రం అంతంతమాత్రమే. రవాణా, మౌలిక సౌకర్యాలు కల్పించి ఎంతో చరిత్ర గల ఎలగందుల ఖిల్లాను సంరక్షించాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎన్ని చట్టాలొచ్చినా ఆగని ఆడపిల్లల విక్రయాలు... భ్రూణ హత్యలు!
Last Updated : Dec 12, 2019, 11:06 AM IST