mlc kaushik reddy's sensational comments: కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జెండా మోసిన వాళ్లకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పెద్దపల్లిలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగింది.
తెరాస జెండా మోసిన వారికే సంక్షేమపథకాలు, కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు - తెరాస కార్యకర్తల భేటీ
mlc kaushik reddy's sensational comments ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీణవంకలో జరిగిన పార్టీ కార్యకర్తల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. తెరాస పార్టీ కండువా కప్పుకొని జెండాలు మోసిన వారికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందుగా అందుతాయని ప్రకటించారు. త్వరలో కేసీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బు కేవలం తెరాస కార్యకర్తలకు ఇస్తారన్నారు. ఎమ్మెల్సీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గ్రామసర్పంచ్, పార్టీ అధ్యక్షులు ఇచ్చే లిస్టే ఫైనల్ అవుతుందని స్పష్టం చేయడం కూడా సంచలనంగా మారింది.
2 నెలల లోపల కేసీఆర్ సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేవారికి 3లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ జెండా మోసిన వ్యక్తికే ఈ నిధులు అందుతాయి. వేరేవారికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ జాబితా కూడా నేను డిసైడ్ చేయను. మీ ఊరిలో ఉన్న మన టీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న పేర్లే ఫైనల్- పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ