Gouravelli Project News: ప్రతిపక్షాలు భూనిర్వాసితులను రెచ్చగొట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసి తీరుతామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనానికి చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు.
'అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసి తీరుతాం' - త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్
Gouravelli Project News: భూనిర్వాసితులను రెచ్చగొట్టి ఎన్ని అడ్డంకులు సృష్టించినా... అతి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసి తీరుతామని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద తూము నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించాల్సిన 3900 ఎకరాల భూసేకరణలో ఇంకా కేవలం 84 ఎకరాలు మాత్రమే మిగిలి పోయిందని తెలిపారు. ఆ భూమిని సైతం అతి త్వరలో ఎకరానికి 15 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించి సేకరిస్తామని పేర్కొన్నారు. 500 మంది మేజర్లకు జీవో 68 ప్రకారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి అందులో ఒక ఫ్లాట్... ఎమ్మెల్యే కోటా నుంచి ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: