Illness to Jagtial MLA: రాష్ట్రంలో ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే జనాలు బయటకి రావాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే ఎండవేడిమికి సొమ్మసిల్లిపడిపోయారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి పథకం చెక్కులను ఇంటింటికి తిరుగుతూ ఎండలోనే పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలా ఎండవేడిమిని సైతం లెక్కచేయకుండా తిరిగినా ఎమ్మెల్యే అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోయారు. కార్యక్రమం మధ్యలోనే ఎస్వీఎల్‌ఆర్ గార్డెన్‌లో ఓ బెడ్ తెప్పించుకుని అక్కడే కొద్దిసేపు సేదతీరారు.