తెలంగాణ

telangana

ETV Bharat / city

'క్రీడలతో యువతలో పోటీతత్వం పెరుగుతుంది' - Gangula Kamalakar inaugurated the joint district volleyball tournament at Chopdandi

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Minister of State Gangula Kamalakar inaugurated the joint district volleyball tournament at Chopdandi in Karimnagar district
'క్రీడల వలన.. యువతలో పోటీతత్వం పెరుగుతుంది'

By

Published : Jan 16, 2021, 6:54 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాపోటీలను మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32జట్లు హాజరైనట్లు .. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని క్రీడా నిర్వహకులు తెలిపారు.

పోటీతత్వంతో పాటు..

యువకులు క్రీడా పోటీల్లో విస్తృతంగా పాల్గొనాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. క్రీడల వలన దేహదారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. క్రీడా పోటీలు తరచు నిర్వహించటంతో యువతలో పోటీతత్వంతో పాటూ.. విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందుండేందుకు దోహదం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి:'ఎమ్మెల్సీలో ఏం చేద్దాం.. సాగర్​లో ఎలా ముందుకెళదాం'

ABOUT THE AUTHOR

...view details